Header Banner

పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ! విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం!

  Fri May 02, 2025 16:49        Others

పేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఆ అధికారి తాపత్రయం అంతా ఇంతా కాదు. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థులకు మంచి మార్కులు సాధిస్తే ఉచితంగా విమాన ప్రయాణం కల్పిస్తానని మాటిచ్చాడు. పదోతరగతి ఫలితాల్లో ఆ విద్యార్థులు సత్తా చాటారు. దీంతో ఆ అధికారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.



విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లాలో ఇటీవ‌ల విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో స‌త్తాచాటిన ప్ర‌తిభావంతుల‌కు ఎంఈఓ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. జిల్లాలోని బెళుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను.. ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తానని ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థులు సత్తా చాటారు. అందరికీ 550 కుపై గా మార్కులు వచ్చాయి. దీంతో మల్లారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

బెళుగుప్ప మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే విద్యార్థులకు ఆ మండల ఎంఈఓ మల్లారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తానని మాటిచ్చారు. దీంతో ఇందు, లావణ్య, ఈశ్వరి, అర్చన, మధుశ్రీ అనే విద్యార్థినిలు 550కి పైగా మార్కులు సాధించారు. పరీక్షల ముందు, విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఎంఈఓ మల్లారెడ్డి ఒక హామీ ఇచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థినులు ఈ విజయాన్ని తెలుసుకుని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారుల అనుమతితో విమాన ప్రయాణానికి సిద్ధమయ్యారు.


విద్యార్థినులతో కలిసి మల్లారెడ్డి గురువారం బెళుగుప్ప నుండి బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణించారు. హైదరాబాద్ లో పర్యాటక ప్రదేశాలను విద్యార్థినులకు చూపించి తీసుకువస్తానని ఎంఈఓ వివరించారు. దీనికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. మల్లారెడ్డిని పలువురు అధికారులు అభినందించారు. ఇక రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి మే 28 వరకు జరుగుతాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #studentpower #freeairtrip #examtopper #meopromise #mallereddy #beluguppatalents